వసంత నవరాత్రి ఉత్సవములలో భాగంగా బుధవారం సాయంత్రం స్థానిక సంపత్ నగర్ లోని శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానములో అవధాని శ్రీ తాతా సత్య సందీప్ చే అష్టావధాన౦ జరిగింది. అవధాని సత్య సందీప్ గురించి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి మాట్లాడుతూ య౦ ఎస్సీ బయోకెమిస్ట్రీ విద్యార్ధి అయిన సందీప్  ఇంత చిన్న వయసులో అష్టావధాన ప్రక్రియ పై సాధించిన  పట్టు ప్రశంశనీయమైనదని అన్నారు.

అష్టావధాని : శ్రీ తాతా సత్య సందీప్

నిర్వహణ & వార గణనం : శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ‘

నిషిద్ధాక్షరి: పి ఎస్ ఆర్ ఆంజనేయప్రసాద్  

సమస్య : కల్వకొలను సూర్యనారాయణ  

దత్తపది: రామడుగు వెంకటేశ్వర శర్మ

వర్ణన: నారాయణం శేషుబాబు

వ్యస్తాక్షరి : N Ch సుధా మైథిలి

ఆశువు: MV సత్యవతి

అప్రస్తుతప్రసంగం : జి వై యన్ బాబు

భద్రాచలం లోని తిరుమల పీఠం వారిచే అవధాన అష్టాపద , అవధాన చింతామణి , అవధాన యువరాట్ బిరుదత్రయం పొందిన అవధాని సత్య సందీప్ పృచ్చకుల ప్రశ్నలకు అద్భుత సమాధానాలు ఇచ్చి ఆహుతులను ఆశ్చర్యపరిచారు.